సమంత యూటర్న్
వరుస విజయాలను సొంతం చేసుకుంటూ టాప్ హీరోయిన్గా దూసుకుపోతోంది నటి సమంత అక్కినేని. ఆమె ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న యూటర్న్ అనే చిత్రంలో నటిస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రం సెప్టెంబర్ 13న రెండు భాషల్లో ఒకేసారి విడుదల కానుంది. సప్పెన్స్ థ్రిల్లర్‌గా రానున్న ఈ చిత్రంలో సమంత జర్నలిస్టు పాత్రలో నటిస్తున్నారు. వపన్‌కుమార్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో భూమిక, అది పినిశెట్టి, రాహుల్ రవీంద్రన్ ముఖ్యపాత్రల్లో కనిపించబోతున్నారు. శ్రీనివాస సిల్వర్‌స్క్రీన్ పతాకంపై శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తున్నారు. సంగీతం పూర్ణ చంద్ర తేజస్వీ అందిస్తున్నారు.













