Samantha: సమంతకు మరో అరుదైన గుర్తింపు
నటి సమంత (Samantha) కు మరో అరుదైన గుర్తింపు దక్కింది. ప్రముఖ మ్యాగజైన్ గ్రాజియా ఇండియా (Grazia India) లేటెస్ట్ ఎడిషన్ కవర్ పేజీ (Cover page) పై ఆమె ఫొటో (, Photo) ప్రచురితమైంది. ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం ఈ సందర్భంగా ఈ స్టిల్ విడుదలైంది. మ్యాగజైన్లో భాగమైన ఐదుగురు మహిళా ఫొటోగ్రాఫర్లు, ఆరుగురు డిజైనర్లతో ఫొటోగ్రఫీ డే సెలబ్రేట్ చేసుకుంటున్నట్టు గ్రాజియా పేర్కొంది. 15 ఏళ్ల నట ప్రయాణంలో గుర్తుండిపోయే పాత్రలు పోషించారంటూ గ్రాజియా కొనియాడిరది. తనదైన ముద్ర వేశారని ప్రశంసించింది. 22 క్యారెట్ల బంగారపు ఉంగరం (Gold ring), గాజులతో సమంత మెరిశారు.







