మేం పేరెంట్స్ గా మారడానికి డేట్ ఫిక్స్ చేసుకున్నాం!
నాగచైతన్యను వివాహం చేసుకుని, అక్కినేని వారింటి కోడలైనా సమంత జోరు ఏమాత్రం తగ్గడం లేదు. సాధరణంగా పెళ్లైన వారిని కమర్షియల్ సినిమాల్లో హీరోయిన్లుగా తీసుకోవడానికి భయపడతారు. కానీ, సమంత విషయంలో మాత్రం అలా జరగడం లేదు. ఇటీవల సమంత హీరోయిన్గా నటించిన రంగస్థలం తెలుగులో బాహుబలి తర్వాత అతి పెద్ద విజయం సాధించింది. ఈ సినిమాలో సమంత నటనకు ప్రశంసలు దక్కాయి. ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా సమంత తల్లి కావడం గురించి మాట్లాడింది. పిల్లల విషయంలో నాకు, చైతన్యకు ఓ క్లారిటీ ఉంది. మేం పేరెంట్స్‌గా మారడానికి డేటా ఫిక్స్ చేసుకున్నాం. ఆ సమయం ప్రకారమే నేను తల్లినవుతాను. తల్లినైన తర్వాత నా బేబీయే నాకు ప్రపంచమవుతుంది. ఉద్యోగాలు చేసే తల్లులంటే నాకు చాలా గౌరవం. పిల్లల కోసం వాళ్లు ఎన్నో త్యాగాలు చేస్తారు. అందరిలాగానే నేనూ తల్లినైన తర్వాత కొన్ని సంవత్సరాలు ఆ బిడ్డే లోకంగా బతుకుతానని సమంత చెప్పింది.













