తెలుగులో మరో ప్రాజెక్టుకు సమంత గ్రీన్‌సిగ్నల్
గతేడాది జాను చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చి పరాజయాన్ని చవిచూసిన సమంత తెలుగులో ఓ ప్రాజెక్ట్‌లో నటించేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. నందినిరెడ్డి దర్శకత్వంలో మళ్ళీ మరో మహిళా ప్రధాన చిత్రాన్ని ఆమె చేయబోతోందట. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో తెరకెక్కిన ఓ బేబీ చిత్రం విశేష ప్రేక్షకాదరణతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం విదితమే. ఇదిలా ఉంటే, సమంత నటించబోయే ఈ నయా చిత్రంలో అతిథిగా నాగచైతన్య కూడా నటించబోతున్నట్టు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మజిలీ తర్వాత మళ్ళీ వీళ్ళిద్దరూ స్క్రీన్‌ని షేర్ చేసుకోబోతున్నారన్నమాట.













