మజిలీ మొదలైంది
శివ నిర్వాణ దర్శకత్వంలో సమంత, నాగచైతన్య హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఇటీవల పొస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రారంభించిన సంగతి విదితమే. కాగా తాజా సినీవర్గాల సమాచారం ప్రకారం నాగచైతన్య ఈ రోజు నుంచి మజిలి చిత్రం షూటింగ్లో పాల్గొంటున్నారు. గతంలో ఏమాయ చేసావే, ఆటోనగర్ సూర్య, మనం చిత్రాలు కలిసి చేసిన చైతు, సమంత పెళ్లి తర్వాత కలిసి నటిస్తున్న తొలి చిత్రం ఇదే కావటం విశేషం. ఈ చిత్రం టైటిల్ మజిలి అనే టైటిల్ పెట్టాలనే యోచనతో టీం ఉంది. భార్యభర్తల మధ్య అనుబంధాన్ని తెలిపేలా తెరకెక్కుతుంది. హిందీ నటి దివ్యంత కౌశిక్ కీలకపాత్రలో నటించనున్న ఈ చిత్రానికి గోపిసుందర్ సంగీతం అందిస్తున్నారు. సాహు గరపాటి, హరీష్ పెద్ది సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.













