అందుకే ఈ నిర్ణయం
సౌత్ బ్యూటీ సమంత ప్రస్తుతం వరుస హిట్లతో దూసుకుపోతోంది. పెళ్లయిన తర్వాత ఆమె గ్లామర్ రోల్స్ తగ్గించింది. తనకు తగిన పాత్రలనే ఆమె ఎంపిక చేసుకుంటోంది. సబ్జెక్ట్‌లు ఎంచుకోవడంలో పాటిస్తున్న జాగ్రత్తల వల్ల అమె కొన్ని సినిమాలను చేయలేకపోతోంది. ఇటీవల యూ టర్న్ మూవీతో మంచి విజయాన్ని తన ఖాతలో వేసుకుంది. అయితే తనకు వచ్చే ఛాలెంజింగ్‌గా ఉండే పాత్రలతో ఎవరైనా ఆఫర్ ఇవ్వగలిగితే, రెమ్యునరేషన్ తగ్గించుకోవడానికి సిద్దమేనని చెప్పింది సమంత. రోల్ నచ్చితే మాత్రం తన పారితోషికాన్ని తగ్గించేసే సినిమా చేసేందుకు రెడీ అని అంటోంది. తన కెరీర్లో మరచిపోలేని సినిమాలు ఉండిపోవాలనే లక్ష్యంతోనే సమంత ఈ నిర్ణయానికి వచ్చిందని అంటున్నారు.













