హ్యాట్రిక్ కొట్టిన సమంత
పెళ్లైన తర్వాత సమంత జోరు ఇంకాస్త పెరిగింది. అద్భుత నటనతో వరుస విజయాలు అందుకుంటూ దూసుకుపోతోంది. ఈ వేసవిలో సమంత మూడు బ్లాక్‌బస్టర్ హిట్లను అందుకుంది. రామ్‌చరణ్‌తో జోడీగా నటించిన రంగస్థలం ఎంతటి సంచలన విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాగే మహానటి సావిత్రి జీవితకథ ఆధారంగా తెరకెక్కిన మహానటి లోనూ సమంత తన నటనతో కంటతడి పెట్టించింది. ఈ సినిమా కూడా సంచలన విజయం దిశగా దూసుకుపోతోంది.
విశాల్ సరసన నటించిన తమిళ సినిమా ఇరుంబుతిరై ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా కూడా హిట్ టాక్ తెచ్చుకుంది. దీంతో సమంత ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. నాకు ఇది అత్యుత్తమమైన వేసవి. వరుసగా ఘనవిజయాలను అందిస్తున్న మీకు ధన్యవాదాలు. ఇంతకు మించి ఇంకేం కోరుకుంటాను. రంగస్థలం, మహానటి, ఇరుంబుతిరై హ్యాట్రిక్. ఈ ప్రపంచంలో అత్యంత సంతోషంగా ఉన్న అమ్మాయిని నేనే అంటూ సమంత ట్వీట్ చేసింది.













