సమంతకు మరో కొత్త సమస్య
కెరీర్ జెట్ స్పీడ్ తో సాగిపోతున్న సమయంలో టాలీవుడ్ క్వీన్ సమంతకు అనారోగ్య సమస్య వచ్చిన సంగతి తెలిసిందే. దానికి ముందు వరకు సమంత ఎక్కడ కాలు పెడితే అక్కడ సక్సెస్ అన్నట్లు కెరీర్ ను కొనసాగించింది. ప్రస్తుతం మయోసైటిస్ చికిత్స లో భాగంగా రెస్ట్ లో ఉన్న సమంత, బ్రేక్ తర్వాత బాలీవడ్ లో దూసుకెళ్లాలని తెగ ట్రై చేస్తోంది.
ఇప్పటికే దానికి సంబంధించిన ప్లాన్ కూడా సమంత చేసుకున్నట్లు తెలుస్తోంది. అందుకే తన హెల్త్ ను సెట్ చేసుకుని కాస్త లేటయినా సరే కెరీర్ ను సక్సెస్ దిశగా తీసుకెళ్లొచ్చనే ధీమాతో ఉంది సమంత. లేకపోతే ఈ పాటికే వచ్చిన సినిమాలను చేసేసేది. ఇదిలా ఉంటే ఇప్పటికే మయోసైటిస్ తో బాధ పడుతున్న సమస్యకు మరో ఇబ్బంది కూడా ఉందట.
సమంతకు పూలంటే పడదట. ఆ వాసనతో ఎక్కువ టైమ్ ఉండలేనని సమంత రీసెంట్ గా చెప్పుకొచ్చింది. అందుకే సమంత ఇప్పటివరకు ఏ సినిమాలోనూ నేచురల్ ఫ్లవర్స్ తో నటించలేదు. అంతగా అవరసరమనుకుంటే ప్లాస్టిక్ పూలతో మేనేజ్ చేసేదట తప్పించి నేచురల్ ఫ్లవర్స్ జోలికి మాత్రం వెళ్లదట. ఇదిలా ఉంటే సమంత నుంచి చివరిగా వచ్చిన ఖుషి సినిమా బాక్సాఫీస్ వద్ద డివైడ్ టాక్ తో నడిచింది. ప్రస్తుతం రెస్ట్ లో ఉన్న సమంత, ఎప్పుడైనా సినిమాల్లోకి కం బ్యాక్ ఇచ్చే ఛాన్సుంది.













