సమంత ప్రత్యేక పూజలు చేసిందా?
టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత గత కొన్ని వారాలుగా మీడియాకు దూరంగా ఉండటం, సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండకపోవడం చర్చనీయాంశంగా మారింది. దానికి కారణం సామ్ రీసెంట్గా కొన్ని ప్రత్యేక పూజల్లో బిజీగా ఉండటమే అని నెట్టింట ప్రచారం జరుగుతోంది. వేద పాఠశాలలో సమంత జరిపిన ప్రత్యేక పూజలకు సంబంధించిన కొన్ని ఫోటోలు ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతున్నాయి.
అయితే ఆ ఫోటోలు తాజావా లేదా గతంలో నిర్వహించిన పూజకు సంబంధించినవా అనేది మాత్రం తెలియాల్సి ఉంది. నిజానికి సామ్ తన మాజీ భర్త నాగచైతన్యతో విడిపోయాక మెంటల్‌గా స్ట్రాంగ్ అవడానికి తీర్థయాత్రలు, టూర్స్‌ని సెలెక్ట్ చేసుకుందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే తన ఫ్రెండ్ శిల్పారెడ్డితో కలిసి చార్ ధామ్, గంగోత్రి, బద్రీనాథ్, యమునోత్రి, కేదార్‌నాథ్‌లు వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించింది. అప్పట్లో ఆ ఫోటోలు కూడా నెట్టింట వైరల్ అయ్యాయి.
ఇప్పుడు సామ్ మరోసారి పూజలు నిర్వహించిందని చెప్పుకుంటున్నారు. సమంత తెరపై సంతోషంగా కనిపిస్తున్నప్పటికీ, లోపల బాధను అనుభవిస్తోందని, ఆ బాధను పోగొట్టుకునేందుకు పూజా మార్గాన్ని ఎంచుకుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.













