క్రేజీ ప్రాజెక్టుకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సమంత
ఖుషి సినిమా తర్వాత కెరీర్ లో గ్యాప్ తీసుకున్న సమంత తిరిగి ఎప్పుడు వెండితెర మీద కనిపిస్తుందా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఓన్ ప్రొడక్షన్ లో మా ఇంటి బంగారం అనే సినిమాను అనౌన్స్ చేసింది కానీ అంతకుమించి ఎలాంటి డీటెయిల్స్ చెప్పలేదు. ప్రస్తుతం తన తర్వాతి ప్రాజెక్టుల కోసం కథలు వింటున్న సమంత ఓ ఇంట్రెస్టింగ్ కాంబోకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఫర్జీ, ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్లకు దర్శకత్వం వహించిన రాజ్ అండ్ డీకే త్వరలో రక్త భ్రమండ్ అనే హారర్ సిరీస్ ను నిర్మించబోతున్నారట. 2018లో తుంబాడ్ తో ఇంటర్నేషనల్ లెవెల్ లో గుర్తింపు తెచ్చుకున్న రహి అనిల్ భర్వే ఈ సిరీస్ కు దర్శకత్వం వహించనున్నాడట. వచ్చే ఏడాది ఆగస్ట్ స్ట్రీమింగ్ టార్గెట్ దిశగా ఈ సిరీస్ను పూర్తి చేయనున్నట్లు సమాచారం.
నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ కానున్న ఈ సిరీస్ భారీ బడ్జెట్ తో ఇప్పటివరకు ఇండియన్ స్క్రీన్ మీద ఎవరూ టచ్ చేయని కొత్త బ్యాక్ డ్రాప్ తో రానుందట. గూస్ బంప్స్ సీన్స్ తో పాటూ ట్విస్టులతో రక్త్ భ్రమండ్ ఆడియన్స్ కు కొత్త అనుభూతినిస్తుందని యూనిట్ సభ్యులంటున్నారు. ఈ సిరీస్లో సమంతతో పాటూ వామికా గబ్బి, సిద్దార్థ్ రాయ్ కపూర్ కూడా కీలక పాత్రలు చేయనున్నారు.













