Samantha: పాత అందంతో మరింత మెరిసిపోతున్న సమంత
ఏ మాయ చేసావె(Ye Maya Chesave) సినిమాతో అందరి మనసులు దోచేసిన సమంత(Samantha) మొదటి సినిమాతోనే నటిగా మంచి మార్కులు దక్కించుకుంది. తక్కువ టైమ్ లోనే స్టార్ హీరోయిన్ గా పేరు ప్రఖ్యాతులు అందుకున్న సమంత మయోసైటిస్ వల్ల తన అందాన్ని పోగొట్టుకుంది. ప్రస్తుతం తన పాత అందాన్ని సంపాదించుకోవాలని చూస్తున్న సమంత తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో షేర్ చేసిన కొన్ని ఫోటోలు ఎంతో అందంగా కనిపిస్తున్నాయి. ఈ ఫోటోల్లో సమంత స్టైలిష్ గా కనిపిస్తూ, వాచ్ పెట్టుకుని చాలా ఎట్రాక్టివ్ గా దర్శనమివ్వగా, సమంత మళ్లీ పాత అందానికి వచ్చేసిందని కామెంట్స్ చేస్తూ ఆ ఫోటోలను వైరల్ చేస్తున్నారు.













