సమంతకు మరో ఆఫర్
ది ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్2 తో డిజటల్ ఎంట్రీ ఇచ్చిన సమంత, అందులో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర చేసినప్పటికీ ఆడియన్స్ ఆమె నటనకు బాగానే కనెక్ట్ అయ్యారు. సమంత బోల్డ్ పెర్ఫార్మెన్స్ తో అందరికీ రీచ్ అయింది. ఈ వెబ్ సిరీస్ తర్వాత సమంత అదే రాజ్ అండ్ డీకే దర్శకులతోనే సిటిడాల్ అనే వెబ్ సిరీస్ కూడా చేసింది.సిటాడెల్ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటుంది. ఇదిలా ఉంటే ఫ్యామిలీ మెన్ నెక్ట్స్ సీజన్ లో కూడా నటించాలని సమంత అనుకుంటుంది. కానీ రాజ్ అండ్ డీకే దానికంటే ముందుగా మరో క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ను అనౌన్స్ చేశారు. రక్తబీజ్ అనే టైటిల్ తో తెరకెక్కనున్న ఈ వెబ్ సిరీస్ లో ఆదిత్య రాయ్ కపూర్ హీరోగా నటించనున్నాడట.
ఈ సిరీస్‌లో నటించడానికి సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో తెరకెక్కనున్న ఈ సిరీస్ లో సమంత ఎలాంటి పాత్ర చేయబోతుందనేది ఇంకా బయటకు రాలేదు. మొత్తానికి వరుస వెబ్ సిరీస్‌లతో సమంత బాలీవుడ్లో బాగానే మార్కెట్ ను క్రియేట్ చేసుకుంటుంది. టైమ్ చూసి సినిమాల్లోకి కూడా ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నప్పటికీ సరైన ఛాన్స్ రాక వెయిట్ చేస్తుంది. సిటాడెల్ పూర్తి చేసిన సమంత ప్రస్తుతం తన ప్రొడక్షన్ లోనే మా ఇంటి బంగారం అనే సినిమాను అనౌన్స్ చేసింది. ప్రస్తుతం ఆ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటుంది. మరికొన్ని ప్రాజెక్ట్స్ డిస్కషన్స్ స్టేజ్‌లో ఉన్నట్లు సమాచారం.













