సామ్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ పై మేనేజర్ క్లారిటీ…!?
టాలీవుడ్ లో ఒకప్పటి నెంబర్ 1 హీరోయిన్ సమంత. “ఏ మాయ చేసావే” చిత్రంతో టాలీవుడ్ లో అడుగుపెట్టి అందరినీ మాయ చేసింది ఈ అమ్మడు.సామ్ సడన్ గా అనారోగ్యానికి గురవ్వడంతో తాను నటిస్తున్న సినిమా షూటింగ్ లు ఆగిపోయిన సంగతి తెలిసిందే. ‘ఖుషీ’ సినిమా షూటింగ్ అయితే సమంత సెట్స్ కు వస్తే గాని జరగని పరిస్థితిలో ఉంది. ఆమె వచ్చే వరకూ వెయిట్ చేయడం తప్ప ఈ సినిమా టీమ్ కి వేరే దారిలేదు అనే చెప్పాలి. అలాగే సామ్ సైన్ చేసిన బాలీవుడ్ షూటింగ్ లు కూడా డిలే అవుతున్నట్లు తెలుస్తోంది. దీంతో సమంత పై నెట్టింట ప్రచారం పతాక స్థాయికి చేరింది.
అనారోగ్యం వల్ల సామ్ షూటింగ్ కి వెళ్లకపోవడంతో ఆమె సైన్ చేసిన బాలీవుడ్ సినిమాలు అమెను తప్పిస్తున్నాయని, కొత్త హీరోయిన్ కోసం వెతుకుతున్నట్టు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఈ తరహాలోనే ఖుషీ టీమ్ కూడా సామ్ కోసం మరికొన్ని రోజులు వెయిట్ చేసి, తన హెల్త్ సెట్ అవ్వకపోతే హీరోయిన్ రీప్లేస్ గురించి ఆలోచించే అవకాశాలు ఉన్నట్లు మీడియాలో కథనాలు వచ్చాయి.
ఒకవేళ సమంత కోలుకున్నా! కొన్నినెలలు పాటు పూర్తి రెస్ట్ తీసుకునే అవకాశం ఉందని, ఎలాంటి సినిమా షూటింగ్ లకి అటెండ్ అయ్యే ఛాన్స్ లేదని నెట్టింట వార్తలు హల్చల్ చేస్తున్నాయి. నేపథ్యంలో తాజాగా మీడియా కథనాలపై సమంత మేనేజర్ క్లారిటీ ఇచ్చారు. ఇవన్నీ మీడియా క్రేయేట్ చేసిన వార్తలని ఆయన ఖండించారు. సమంత సంక్రాంతి తర్వాత ఖుషీ సినిమా షూటింగ్ కి హాజరవుతుందని గాట్టిగా చెప్పారు.
ఆ సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత హిందీ సినిమాలు పూర్తి చేయనుందన్నారు. ఏప్రిల్-మే నెలల నుంచి పూర్తి స్థాయిలో హిందీ సినిమాలపై సామ్ దృష్టి పెడుతుందని క్లారిటీ ఇచ్చారు. తన కారణంగా నిర్మాతలు ఎవరూ ఇబ్బంది పడకూడదని, అవసరం అనుకుంటే తన ప్లేస్ లో వేరే హీరోయిన్లతో షూటింగ్ చేసుకోవచ్చని, తీసుకున్న అడ్వాన్స్ కూడా తిరిగి ఇచ్చేస్తానని సామ్ హిందీ నిర్మాతలతో చెప్పినట్లు మేనేజర్ తెలిపారు.













