Samantha: పర్‌ఫ్యూమ్ బిజినెస్ లోకి సమంత

సమంత(Samantha) ఈ మధ్య తను నటించే సినిమాల ద్వారా కాకుండా వ్యక్తిగత విషయాల ద్వారా వార్తల్లో ఎక్కువగా నిలుస్తుంది. ఫ్యామిలీ మ్యాన్ డైరెక్టర్ రాజ్ నిడిమోరు(Raj Nidimoru)తో రిలేషన్ లో ఉందని సమంత గురించి తెగ వార్తలొస్తున్నాయి. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా వరుస పెట్టి సినిమాలు చేసిన సమంత తర్వాతి ప్రాజెక్టు ఏంటా అని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
అయితే సమంత సినిమాల్లో కంటే ముందు మరో బిజినెస్ లోకి ఎంటరవుతున్నట్టు తెలుస్తోంది. అదే పర్‌ఫ్యూమ బిజినెస్. కేవలం కొత్త బిజినెస్ ను మొదలుపెట్టడమే కాకుండా దాన్ని ప్రీమియం లైఫ్ స్టైల్ బ్రాండ్ గా మార్చాలని చూస్తుందట సమంత. అందులో భాగంగానే కాన్సెప్ట్ నుంచి బ్రాండింగ్ వరకు ప్రతీ విషయంలోనూ సమంత ఇన్వాల్వ్ అవుతుందని అంటున్నారు.
ఫ్యాషన్ రంగంలో ఎప్పుడూ అప్డేట్ గా ఉండే సమంత ఇప్పుడు ఈ ప్రాజెక్టును విజయంత చేయాలని డిసైడైందని అంటున్నారు. ఇది సక్సెస్ అయితే సమంత కెరీర్లోనే ఓ కొత్త అధ్యాయం సృష్టించినట్టు అవుతుంది. ఇక సినిమాల విషయానికొస్తే సమంత ఇప్పటికైతే ఎలాంటి కొత్త ప్రాజెక్టునీ సైన్ చేయలేదు. రెండు ప్రాజెక్టులు ప్రస్తుతం డిస్కషన్స్ లో ఉండగా వాటికి స్టార్ డైరెక్టర్లు వర్క్ చేయనున్నారని అంటున్నారు. అందులో ఒకటి తెలుగు సినిమా కాగా మరోటి హిందీ సినిమా అని తెలుస్తోంది.