ముస్తఫా ముస్తఫా! అంటూ స్నేహితురాలితో కలిసి అలెప్పీలో సమంత ఎంజాయ్
కేరళలో అలెప్పీలో తన స్నేహితురాలితో కలిసి సమంత ఎంజాయ్ చేస్తోంది సమంత . ఈ సందర్భంగా తన ఫ్రెండ్ గురించి చెబుతూ సమంత ఎమోషనల్ అయింది. నువ్ లేకపోతే ఈ జీవితంలో ఇదంతా సాధ్యమయ్యేదా అన్నట్టుగా చెప్పుకొచ్చింది. సమంత ప్రస్తుతం వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తోంది. సమంత కేరళ అందాలను వీక్షిస్తూ పులకిస్తోంది. తన ఫ్రెండ్‌తో కలిసి సమంత కేరళను చుట్టేస్తోన్నట్టు కనిపిస్తోంది. కేరళలోని అతిరపిళ్లి వాటర్ ఫాల్స్‌లో సమంత ఎంజాయ్ చేసింది. ఇక అలెప్పీలో తన ఫ్రెండ్‌తో కలిసి సాగర తీరాన సరదాగ గడిపినట్టుంది. మొత్తానికి సమంత మాత్రం ఇప్పుడు తనకు నచ్చిన విధంగా గడిపేస్తోంది.
ఫ్రెండ్స్‌తో కలిసి తిరుగుతోంది. స్వేచ్చగా విహరిస్తోంది. నాగ చైతన్యతో విడాకులు అయిన క్షణం నుంచి సమంత ప్రపంచాన్ని చుట్టేస్తోంది. ఛార్ ధామ్ యాత్ర ముగిసిన తరువాత దుబాయ్‌కి వెళ్లి వచ్చింది. ఆ తరువాత స్విట్జర్లాండ్‌లో అద్భుతమైన విన్యాసాలు చేసింది. ఇక ఇప్పుడు కేరళ అందాలను వీక్షిస్తోంది. అయితే ఇలా వెకేషన్లతో ఎంత బిజీగా ఉన్నా కూడా తన సినిమా విషయాలను కూడా చూసుకుంటోంది. తన వ్యాపారాలను కూడా సమంత ఓ కంట కనిపెడుతూనే ఉంది. సాకీని వీలైనంతగా ప్రమోట్ చేస్తూనే ఉంది. ఏకం లర్నింగ్ స్కూల్‌ను కూడా చూసుకుంటోంది. ఇక సమంత శాకుంతలం షూటింగ్‌ను ఎప్పుడో పూర్తి చేసేసింది. యశోద షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమా కోసం భారీ సెట్‌ను వేసినట్టు తెలుస్తోంది. మూడు కోట్లతో భారీ సెట్‌ను వేస్తున్నారట. మొత్తానికి సినిమా పనులు అలా జరుగుతూ ఉంటే.. ఇంకో వైపు సమంత మాత్రం జాలీగా తిరిగేస్తోంది. తన ఫ్రెండ్ మేఘన వినోద్ గురించి చెబుతూ సమంత ఎమోషనల్ అయింది. నువ్ లేకపోతే ఈ జీవితంలో ఇదంతా చేయగలిగేదాన్నా? అని ఊహించుకోలేకపోతోన్నాను అంటూ సమంత చెప్పుకొచ్చింది.













