సమంత స్థానంలోకి కొత్త హీరోయిన్
మయోసైటిస్ చికిత్స లో భాగంగా మూవీలకు గ్యాప్ ఇచ్చి ప్రస్తుతం విదేశాల్లో చిల్ అవుతున్న సమంత ఎప్పటికప్పుడు అక్కడ దిగిన ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. సమంత ఈ బ్రేక్ కోసం తాను గతంలో ఒప్పుకున్న సినిమాల అడ్వాన్స్‌లు కూడా తిరిగిచ్చేసిందని వార్తలైతే వచ్చాయి కానీ ఆ సినిమాల డీటెయిల్స్ మాత్రం తెలియదు.
సమంత బ్రేక్ తీసుకోకముందు నందినీ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా చేయనుందని అప్పట్లో వార్తలొచ్చాయి. గతంలో వీరి కాంబోలో వచ్చిన జబర్దస్త్, ఓ బేబీ సినిమాలు మంచి హిట్ అవడంతో ఈ కాంబోలో సినిమా గురించి వచ్చిన వార్తలు నిజమే అనుకున్నారు. బ్రేక్ అయిపోయాక సమంత ఈ సినిమా చేస్తుందని ప్రచారం కూడా జరిగింది.
తాజా సమాచారం ప్రకారం, సమంత ఆ సినిమా చేయట్లేదని, ఈ సినిమా కోసం నందినీ రెడ్డి ఓ ఫ్రెష్ ఫేస్‌ను వెతికే పనిలో ఉందని తెలుస్తోంది. సిద్దూ జొన్నలగడ్డ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కనుంది. ఈ సినిమా కోసం మరి నందినీ ఏ హీరోయిన్ను తీసుకొస్తుందో చూడాలి.













