Samantha: రూల్స్ పెడితే అసలు నచ్చదు
మోడలింగ్ నుంచి అనుకోకుండా సినిమాల్లోకి వచ్చిన సమంత(Samantha) ఏ మాయ చేసావే(Ye Maya Chesave) తోనే హీరోయిన్ గా పరిచయం అయింది. ఆ సినిమాతో మంచి క్రేజ్ రావడంతో తక్కువ టైమ్ లోనే సమంత(Samantha) స్టార్ హీరోయిన్ గా మారింది. కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే నాగ చైతన్య (Naga Chaithanya) పెళ్లి చేసుకున్న సమంత, తర్వాత మనస్పర్థల వల్ల పరస్పర అంగీకారంతో ఇద్దరూ విడిపోయారు.
ఆ తర్వాత సమంతకు మయోసైటిస్ వ్యాధి వచ్చి కొన్నాళ్ల పాటూ చికిత్స కోసం సినిమాలకు దూరమైన సమంత ఇప్పుడు మళ్లీ వరుస పెట్టి సినిమాలు చేయాలని డిసైడైంది. ఈ మధ్య సమంత ఏం మాట్లాడినా వార్తల్లో నిలవడం కామన్ అయిపోయింది. రీసెంట్ గా సిడ్నీలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న సమంత అక్కడ చేసిన కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్ గా మారాయి.
తనకు ఎవరైనా సరే రూల్స్ పెడితే నచ్చదని, రూల్స్ పెట్టడానికి తానేమీ చిన్న పిల్లను కాదని, తన జీవితం తనకు నచ్చినట్టు బతకాలనుకున్నట్టు చెప్పిన సమంత సక్సెస్ అంటే విజయాలు మాత్రమే కాదని, మనకు నచ్చినట్టు ఉండటం కూడా అని చెప్పింది. సమంత ఈ మాటల్ని నాగ చైతన్యను దృష్టిలో పెట్టుకునే అనిందని నెటిజన్లు సోషల్ మీడియాలో అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. చైతన్య, సమంత విడిపోయి నాలుగేళ్లవుతున్నా ఏదొక రూపంలో వాళ్లిద్దరినీ తిరిగి వార్తల్లోకి తెస్తున్నారు జనాలు.













