అమెరికాలో ఉన్న రాలేకపోతున్నా… క్షమించండి
రామ్‌చరణ్, సమంత జంటగా నటించిన చిత్రం రంగస్థలం. సుకుమార్ దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. దేవిశ్రీ ప్రసాద్ బాణీలు అందించారు. పల్లెటూరి నేపథ్యంలో మార్చి 30న విడుదలైన ఈ చిత్రానికి విశేషమైన స్పందన లభించింది. చిట్టిబాబుగా చరణ్, రామలక్ష్మిగా సామ్ అద్భుతంగా నటించారని ప్రశంసిచారు. అంతేకాదు సినిమా బాక్సాఫీసు వద్ద చక్కటి వసూళ్లును రాబడుతోంది. ఈ నేపథ్యంలో ప్రేక్షకులకు ధన్యవాదాలు చెబుతూ చిత్ర బృందం సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోయానని సామ్ ట్వీట్ చేశారు. మీ ప్రేమకు కృతజ్ఞరాలిని, గొప్పగా భావిస్తున్నా, అద్బుతమైన రంగస్థలం బృందంతో కలిసి పనిచేయడం గర్వంగా ఉంది. థ్యాంక్స్ మీట్‌కు హాజరై, సంతోషంగా ఉన్న మిమ్మల్ని చూడలేకపోతున్నా. ఈ సినిమాలో నటించే అవకాశం రావడం నిజంగా నా అదృష్టం అని పేర్కొన్నారు. సమంత ప్రస్తుతం తన భర్త నాగచైతన్యతో కలిసి అమెరికలో ఉన్నారు. విహారయాత్ర నిమిత్తం ఇటీవల వారు అక్కడికి వెళ్లారు. ఈ సందర్భంగా అక్కడి పలు ప్రదేశాలను సందర్శిస్తున్నారు. సెంట్రల్ పార్క్ వద్ద చైతో కలిసి దిగిన సెల్ఫీని ఆమె అభిమానులతో పంచుకున్నారు.













