సమంత, అనుష్క వల్ల హీరోలపై భారం
హీరోతో సమానంగా పాత్రలు కావాలనుకుంటున్నప్పుడు సినిమా తరపున ప్రమోషన్లలో కూడా హీరోల్లా అంతే యాక్టివ్గా ఉండాలి. దర్శకనిర్మాతలు కూడా హీరోయిన్ల నుంచి అంతే కోరుకుంటారు. కానీ వారం గ్యాప్లో థియేటర్లలో అడుగుపెడుతున్న సమంత, అనుష్కలకు ఒకే ప్రాబ్లమ్ రానివ్వకుండా చేస్తుంది. సామ్ కు ఎప్పటి నుంచో ఉన్న మయోసైటిస్ ట్రీట్మెంట్ కోసం అమెరికా వెళ్లింది. వెళ్లేది ఖుషి రిలీజ్ తర్వాత కూడా వెళ్ళొచ్చు కానీ శాకుంతలం కోసం చాలా కష్టపడినా ఫలితం దక్కకపోవడంతో ఇప్పుడు సినిమా సక్సెస్ తర్వాత దాన్ని ఎంజాయ్ చేయొచ్చులే అనే ఆలోచనతో సామ్ అమెరికాకు చెక్కేసింది. ఇక అనుష్క విషయానికొస్తే ఆమెకు ఎలాంటి వ్యాధి లేదు కానీ కొన్నాళ్లుగా మీడియా ముందుకు రావడానికి అనుష్క సుముఖత చూపడం లేదు.
మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ట్రైలర్ లో బొద్దుగా మారిన అనుష్కను అందరూ చూశాం. ఇప్పుడు మీడియా ముందుకొస్తే దానికి సంబంధించిన ప్రశ్నలు ఎదురువుతాయని ప్రమోషన్లకు దూరంగా ఉంటుంది. అయినా సినిమాలో నటించినప్పుడు లేని మొహమాటం సినిమా ప్రమోషన్ల దగ్గరకు వచ్చేసరికి ఎందుకొస్తుందనేది అందరికీ అర్థం కాని ప్రశ్న.
ఏదేమైనా సినిమా ప్రమోషన్లకు రాకపోవడం వారి పర్సనల్ ఛాయిస్. దీని వల్ల ఆయా హీరోలపై ప్రమోషన్ల బరువు పెరిగిపోతుంది. సమంత, అనుష్క ఫ్యాన్స్ ఈ విషయంలో నిరాశతో ఉన్నప్పటికీ సినిమాలు హిట్ అయితే చాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. బిజినెస్ పరంగా ఖుషి సినిమా ఎక్కువ అయినప్పటికీ అనుష్క సినిమాను తక్కువ అంచనా వేయడానికి లేదు.













