పీవీ సింధుగా సమంత?
బ్యాడ్మింటన్ ప్రపంచ చాంపియన్ పీవీ సింధు బయోగ్రఫీ కోసం బాలీవుడ్ నటుడు సోనూసూద్ చాలాకాలంగా వర్కౌట్స్ చేస్తోన్న విషయం తెలిసిందే. స్క్రిప్ట్ లాక్ చేస్తున్న ప్రతిసారీ సింధు మరో సెన్సేషనల్ రికార్డు సృష్టిస్తుండటంతో బయోగ్రఫీ క్లైమాక్స్ ఎప్పటికప్పుడు మారుతోంది. తాజాగా ప్రపంచ చాంపియన్‌షిప్ సాధించటంతో ఆ ఈవెంట్‌నే క్లైమాక్స్ చేసుకొని సినిమా తెరకెక్కించాలని సోనూసూద్ ఓ నిర్ణయానికి వచ్చినట్టు చెబుతున్నారు. అయితే సింధు పాత్రను తెలుగు, తమిళ భాషల్లో అగ్రకథానాయికగా కొనసాగుతున్న సమంత చేసే అవకాశం లేక పోలేదని కొద్దికాలంగా వినిపిస్తోంది. ఒకవైపు స్టార్హీరో లతో సినిమాలు చేస్తూనే, ఈ మధ్యే ఓ బేబీతో సెన్సేషనల్ హిట్టందుకుంది సమంత. మొదట సింధు పాత్ర కోసం బాలీవుడ్ బ్యూటీని తీసుకోవాలని యోచించిన సోనూ, సడెన్‌గా సమంతతో చేయాలనే నిర్ణయానికి రావడం ఆసక్తికరమే. ప్రస్తుతం చర్చలు నడుస్తున్నాయని, సమంత ఓకే అంటే వెంటనే సినిమా సెట్స్‌పైకి వెళ్లే అవకాశం లేకపోలేదంటున్నారు.













