ఓ బేబి ఫస్ట్ లుక్ విడుదల
ప్రఖ్యాత నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ 55 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వారి బ్యానర్ లో రాబోతున్న మూవీ ఓ బేబీ ఫస్ట్ లుక్ను విడుదల చేశారు. వైట్ టాప్, లాంగ్ ఫ్రాక్ వేసుకొని చిరునవ్వులు చిందిస్తున్న సమంత వెనుక సీనియర్ నటి లక్ష్మి ఫొటో ఆసక్తికరంగా ఉంది. ఈ చిత్రంలో సమంత స్వాతిగా కనిపించనుంది. సౌత్ కొరియన్ చిత్రం మిస్ గ్రానీ కి అనువాదంగా తెరకెక్కుతున్న ఈ మూవీ ఫాంటసీ కామెడీ జోనర్లో వస్తోంది. 70 ఏళ్ల వృద్ధురాలి ఆత్మ 20 ఏళ్ల యువతిలోకి ప్రవేశిస్తే ఎలా ఉంటుందో చెప్పే సంఘటనల సమాహారమే ఈ మూవీ కథ అని తెలిసింది. నాగశౌర్య, రాజేంద్రప్రసాద్, ఊర్వశి, రావు రమేష్, ప్రధాన తారాగణంగా నటిస్తున్న ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, గురు ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందిస్తున్నారు.













