సమంతకు సర్ ప్రైజ్
నాగచైతన్య, సమంత బ్యూటిపుల్ కపుల్. ఇద్దరు కెరీర్‌పరంగా సక్సెస్‌లో ఉన్నారు. మంగళవారం (ఏప్రిల్ 28) సమంత బర్త్ డే. సహజంగా గ్రాండ్‌గా నిర్వహిస్తారు చైతు. కానీ ఇప్పుడు లాక్డౌన్ సమస్య ఉంది. దాంతో ఇద్దరూ ఇంటికే పరిమితం అయ్యారు. అయితే సమ్‌థింగ్ స్పెషల్‌గా ఉండేందుకు భార్య కోసం ప్రత్యేకంగా కేక్ తయారు చేసి, అర్థరాత్రి పన్నెండు గంటలకు సమంతో కేక్ క్కట్ చేయించి, పుట్టినరోజు జరిపారు. చైతు అభిమానానికి సమంత మురిసిపోయింది. సమంత కొత్త చిత్రాల ఎంపికలో ఎంతో జాగ్రత్తగా ఉంటోంది. ఓబేబీ హిట్ తర్వాత జాను సినిమా చేసింది. ఆ తర్వాత మాత్రం సినిమాలు కమిట్ కాలేదు.













