సాహసాలకు వేళాయెరా!
సాధారణంగా హీరోలైనా, హీరోయిన్లు అయినా, సెలబ్రిటీలు ఎవరైనా జనంలోకి వెళ్లాలంటే చాలా భయపడతారు. ఎందుకంటే తమ అభిమాన తార కళ్లముందు కనిపిస్తే ఏ అభిమాని మాత్రం ఊరుకుంటారు. అందుకే వీలైనంత వరకు జనసమ్మర్థం ఉన్న ప్రదేశాలకు వెళ్లడం మానుకుంటారు. ప్రస్తుతం దేశమంతా లాక్డౌన్ అమలవుతోంది. కాబట్టి జనసమూహం అనేది దాదాపు ఎక్కడా కనిపించదు. ఇలాంటి సమయంలో బయటికి వెళితే.. ఆ ఆలోచన వారికి చాలా థ్రిల్లింగ్గా అనిపిస్తుంది. ముఖ్యంగా సమంతలాంటి హీరోయిన్లకు అది ఒక డ్రీమ్. సాహసాలు చెయ్యాలని చిన్నప్పటి నుంచి కలలు కంటూ ఉంటానని చాలా సందర్భాల్లో చెప్పింది.
ఇప్పుడు అలాంటి అడ్వెంచర్ భర్తతో కలిసి చేసే అవకాశం రానే వచ్చింది. ఈరోజు భర్త నాగచైతన్యతో కలిసి సరుకులు కొనేందుకు బైక్పై బయలుదేరుతూ ఆ ఫోటోను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. మేం ఓ పెద్ద సాహసం చేయడానికి బయలుదేరాం అంటూ ఓ కామెంట్ కూడా పోస్ట్ చేసింది సమంత.













