Samantha: ఏ మాయ చేసావె ప్రతీ షాట్ గుర్తుంది: సమంత
ఏ మాయ చేసావె(Ye maya chesave)తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సమంత(Samantha) ఆ సినిమా తర్వాత వెనక్కి తిరిగి చూసుకునే పన్లేకుండా వరుస ఆఫర్లతో తక్కువ టైమ్ లోనే స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. మధ్యలో వ్యక్తిగత కారణాలు, ఆరోగ్య సమస్యల వల్ల సినిమాల నుంచి గ్యాప్ తీసుకున్న సమంత రీసెంట్ గా సిటాడెల్(Citadel) వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చి తనదైన యాక్షన్ తో అదరగొట్టింది.
ఇక అసలు విషయానికొస్తే సమంత ఏ మాయ చేసావె రిలీజై 15 ఏళ్లు పూర్తైంది. ఈ సందర్భంగా సమంత ఓ ఇంటర్వ్యూలో తన ఫస్ట్ మూవీ టైమ్ ను గుర్తు చేసుకుంది. తాను ఇండస్ట్రీలోకి వచ్చి అప్పుడే పదిహేనేళ్లు అవుతుంది. 15 ఏళ్లనేది చాలా ఎక్కువ టైమ్ అని, కెరీర్ స్టార్టింగ్ లో చేసిన సినిమాలను ఇప్పుడు చూస్తుంటే ఇంత చెత్తగా యాక్ట్ చేశానా అనిపిస్తుందని, కానీ వాటి నుంచే ఎన్నో నేర్చుకున్నానని చెప్తోంది సమంత.
ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తల్లో తనకెవరూ తెలిసిన వారు లేరని, అప్పుడు తనకన్నీ కొత్తేనని సమంత వెల్లడించింది. మొదట్లో గ్లామర్ రోల్స్ చేయడం చాలా ఇబ్బందిగా అనిపించిందని, కానీ తర్వాత ఆ పాత్రల్లో జీవించడం నేర్చుకుని, చేశానని, ఇప్పుడు మళ్లీ ఆ సీన్స్ చూస్తుంటే నవ్వొస్తుందని చెప్పిన సమంత, ఏ మాయ చేసావె కు సంబంధించిన ప్రతీ షాట్ తనకు గుర్తుందని గౌతమ్ మీనన్(Gowtham Menon) తో పని చేయడం మంచి అనుభూతినిచ్చిందని తెలిపింది సమంత.













