Samantha: ఏ మాయ చేసావే ఇప్పుడు చూస్తే సిగ్గేస్తుంది
ఏ మాయ చేసావే(Ye Maya Chesave) సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సమంత(Samantha) మొదటి సినిమాతోనే మంచి నటిగా పేరు తెచ్చుకున్న సమంత, తక్కువ టైమ్ లోనే స్టార్ హీరోలందరితో నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. రీసెంట్ గా సిటాడెల్ హనీ బన్నీ(Citadel Honey Bunny) సిరీస్ తో ప్రేక్షకుల ముందుకొచ్చిన సమంత, ఆ సిరీస్ తో మంచి రెస్పాన్స్ అందుకుంది. నటిగా ప్రూవ్ గా చేసుకున్న సమంత ఇప్పుడు నిర్మాతగా మారిన సంగతి తెలిసిందే.
శుభం(Subham) అనే సినిమాతో సమంత నిర్మాతగా మారుతుంది. ఈ సినిమా మే 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ ను స్పీడప్ చేసింది. ప్రమోషన్స్ లో భాగంగా సమంత ఓ కార్యక్రమంలో పాల్గొని కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. శుభం సినిమాలో నటించిన వాళ్లంతా కొత్తవాళ్లేనని చెప్పిన సమంత వారందరూ తన కంటే బెటర్ అని చెప్పుకొచ్చింది.
అందరూ కొత్తవాళ్లే అయినప్పటికీ చాలా అద్భుతంగా నటించారని, తాను నటిగా ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు యాక్టింగ్ గురించి తనకేమీ తెలియదని, తను నటించిన మొదటి రెండు సినిమాలు ఇప్పుడు చూస్తే చాలా సిగ్గుగా అనిపిస్తుందని, ఇంకాస్త బాగా నటించొచ్చు అనిపిస్తుందని, కానీ వీళ్లు మొదటి సినిమా అయినప్పటికీ చాలా బాగా చేశారని, శుభం సినిమా ప్రతీ ఒక్కరి మనసుని హత్తుకుంటుందని సమంత తెలిపింది.






