Samantha: దగ్గుబాటి ఫ్యామిలీతో సమంత బాండింగ్ అంతే ఉందిగా

అక్కినేని నాగచైతన్య(akkineni naga chaitanya)ను ప్రేమించి పెళ్లి చేసుకున్న సమంత(Samantha) ఆ తర్వాత ఇద్దరికీ మనస్పర్థలు రావడంతో పరస్పర అంగీకారంతో విడిపోయిన విషయం తెలిసిందే. చైతన్య నుంచి విడిపోయినప్పటి నుంచి సమంత అక్కినేని కుటుంబం గురించి ఎక్కడా మాట్లాడింది లేదు. కానీ సమంత అక్కినేని కుటుంబానికి అత్యంత సన్నిహితులైన దగ్గుబాటి ఫ్యామిలీ(daggubati family) తో మాత్రం ఇప్పటికీ మంచి ర్యాపో మెయిన్‌టెయిన్ చేస్తుంది.
సమంత రీసెంట్ గా నిర్మాతగా శుభం(Subham) అనే సినిమాను తీసి దాంతో సూపర్ హిట్ ను అందుకున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా సక్సెస్ మీట్ లో భాగంగా సమంత, టాలీవుడ్ అగ్ర నిర్మాత సురేష్ బాబు(Suresh Babu) గురించి చాలా గొప్పగా మాట్లాడింది. సురేష్ బాబు తనకు ఫ్యామిలీ అని చెప్పిన సమంత, తనకు ఏ సమస్య వచ్చినా ముందు వెళ్లి కలిసేది ఆయన్నే అని కూడా చెప్పింది.
సురేష్ బాబు కు కథ చెప్పి ఒప్పించడం ఎంత కష్టమో అందరికీ తెలుసు. అలాంటి ఆయన తాను వెళ్లి శుభం సినిమా గురించి చెప్పగానే దాని గురించి ఏమీ అడక్కుండానే చేసేద్దామని తనకెంతగానో సపోర్ట్ చేశారని చెప్పింది. సురేష్ బాబుతోనే కాదు, రానా(Rana Daggubati)తో కూడా సమంతకు ఇప్పటికీ మంచి బాండింగే ఉంది. మొన్నామధ్య రానా తన అన్న లాంటి వాడని కూడా చెప్పింది.