సమంత విషయంలో ఆది రివర్స్…
సాధారణంగా పెళ్లయ్యాక హీరోయిన్ల కెరీర్ కొంచెం మందగిస్తుంది. అందుకే పెళ్లిని వీలైనంత వరకు వాయిదా వేస్తుంటారు. కానీ సమంత విషయంలో మాత్రం రివర్స్ జరుగుతోంది. పెళ్లయ్యాక ఆమె కెరీర్ మరింత స్పీడందుకుంది. రంగస్థలం, మజిలి, ఓ బేబి వంటి సూపర్ హిట్స్ పెళ్లయ్యాకే ఆమెను వరించాయి. అయితే సమంత మాత్రం ఇంతటితో సంతృప్తి చెందుతున్నట్లు లేదు. మరో అడుగు ముందుకేసి ఓ వెబ్ సిరీస్‌లో లేడీ విలన్‌గా నటిస్తోంది. వెబ్ సిరీస్ అంటే ఎడ్యుకేటెడ్ యూత్ మాత్రమే చూస్తారు కాబటి…తన ఇమేజ్‌కి ఢోకా ఏమీ ఉండదని ఆమె ధీమా కావచ్చు.













