చిన్న సినిమా.. కొత్త రికార్డులు
రెండు వారాల ముందు టాలీవుడ్ లో ఓ మోస్టరు ఎక్స్పెక్టేషన్స్ తో రిలీజైన సినిమా సామజవరగమన. శ్రీ విష్ణు హీరోగా తెరకెక్కిన ఈ చిన్న సినిమాలో రెబా మోనికా హీరోయిన్ గా నటించింది. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో రామ్ అబ్బరాజు ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. గతంలో ఆయన వివాహ భోజనంబు అనే సినిమాను తెరకెక్కించాడు.
ఇలాంటి చిన్న సినిమా ఇప్పుడు పెద్ద పెద్ద మైలురాళ్లను దాటుతుంది. పాజిటివ్ టాక్ వస్తే రూ.20 కోట్ల కలెక్షన్ వస్తుందిలే అనుకున్న ఈ సినిమా ఇప్పుడు రూ. 50 కోట్ల మైలురాయిని దాటడం విశేషం. కరోనా తర్వాత ఆడియన్స్ ను చిన్న మూవీలకు థియేటర్లకు రప్పించడం చాలా కష్టమనుకుంటున్న రోజుల్లో ఇంటిల్లపాదీ చూసే మూవీ వస్తే కచ్ఛితంగా జనాలు తండోపతండాలుగా థియేటర్లకు వస్తారని ఈ సినిమా నిరూపించింది.
వీక్ డేస్ లో కూడా బలంగా నిలబడిన సామజవరగమనకు రెండో వారంలో కూడా హౌస్ ఫుల్ బోర్డ్స్ పడ్డాయి. బేబీ సినిమా వచ్చాక కూడా ఆ సినిమా తర్వాత ఆడియన్స్ కు ఇదే సెకండ్ ఆప్షన్ గా మారింది. దీంతో కలెక్షన్లు రూ.50 కోట్ల గ్రాస్ కు చేరాయి. అంటే దాదాపు షేర్ విలువ రూ.30 కోట్ల వరకు ఉండొచ్చు. మరోవైపు యూఎస్ లో కూడా సామజవరగమన 1 మిలియన్ డాలర్ల మార్క్ ను కూడా చేరుకుంది. సామజవరగమన లాంటి చిన్న సినిమా ఇన్ని మైలురాళ్లను అందుకుని రికార్డులు సృష్టించడం అంటే గొప్ప విషయమే. అందుకే కంటెంట్ ఈజ్ కింగ్ అంటారు సినీ ప్రముఖులు.













