సమాజానికో హెచ్చరిక చిత్ర పాటల రికార్డింగ్
ప్రియాంక, అలేఖ్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం సమాజానికో హెచ్చరిక. రాజబాబు అచ్చర్త దర్శకుడు. చామకూరి కంబైన్స్ పతాకంపై ఎం.చామకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్ర పాటల రికార్డింగ్ ప్రారంభమైంది. నిర్మాత మాట్లాడుతూ ముగ్గురు యువకుల జీవితగమనానికి దృశ్యరూపంగా ఉంటుంది. స్వశక్తితో ఉన్నత శిఖరాల్ని అధిరోహించిన వారు సమాజహితం కోసం ఎలాంటి మార్గాన్ని అనుసరించారన్నది ఆసక్తిని పంచుతుంది. సేవ్ గర్ల్ చైల్డ్ అనే సందేశంతో ఈ సినిమాను రూపొందిస్తున్నాం అని తెలిపారు. ఈ పాటల రికార్డింగ్ కార్యక్రమంలో శివకృష్ణ, జబర్దస్త్ అప్పారావు, అలేఖ్య, గీతాసింగ్ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: సుభాష్ ఆనంద్, ఛాయాగ్రహణం: సి.హెచ్. భగవాన్, సహ నిర్మాత: సుంకర మణిరాజ్, పాటలు: సురేంద్ర కృష్ణ.













