సలోనికి ఇప్పుడైనా సరైన బ్రేక్ దక్కుతుందా?
మర్యాద రామన్న(Maryada Ramanna) సినిమాలో హీరోయిన్ గా నటించిన సలోని(Saloni) అందరికీ సుపరిచితమే. మర్యాద రామన్న సినిమాలో సునీల్(SUneel) కు జోడీగా నటించిన సలోనికి ఆ సినిమా తర్వాత వరుస అవకాశాలు వస్తాయనుకున్నారంతా. కానీ ఏ సినిమా అమ్మడి కెరీర్ కు ఉపయోగపడలేదు. ఫలితంగా సలోని హీరోయిన్ గా అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది.
కన్నడ, తమిళ భాషల్లో పలు అవకాశాలు దక్కించుకుని సినిమాలు చేసిన సలోనికి కెరీర్లో సరైన బ్రేక్ ఇప్పటివరకు దక్కలేదు. హీరోయిన్ గా కాకపోయినా క్యారెక్టర్ ఆర్టిస్టుగా అయినా బిజీ అవుదామని ట్రై చేస్తుంటే పెద్ద సినిమాల్లో ఛాన్సులు రావడం లేదు. చిన్న సినిమాల్లో నటించినా ఆ సినిమాలతో గుర్తింపు తెచ్చుకోవడం కష్టమవుతోంది.
ఇలాంటి టైమ్ లో సలోనికి వరుణ్ తేజ్(Varun Tej) మట్కా(Matka) సినిమాలో మంచి పాత్ర దక్కింది. మట్కాలో సలోని పద్మ అనే పాత్రలో నటిస్తోంది. ఈ సినిమాపై సలోని చాలానే ఆశలు పెట్టుకుంది. మట్కా హిట్ అయితే కనీసం క్యారెక్టర్ ఆర్టిస్టుగా అయినా బిజీ అవొచ్చని చూస్తోంది అమ్మడు. మరి సలోని ఆశలను మట్కా సినిమా ఏ మేరకు నెరవేరుస్తుందో చూడాలి. నవంబర్ 14న రిలీజ్ కానున్న ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది.













