Sikandar: సికిందర్ లీక్ పై పెరుగుతున్న అనుమానాలు
సల్మాన్(Salman Khan) హీరోగా ఏఆర్ మురుగదాస్(A.R Murugadoss) డైరెక్షన్ లో వచ్చిన యాక్షన్ ప్యాక్డ్ మూవీ సికిందర్. రష్మిక మందన్నా(Rashmika Mandanna) హీరోయిన్ గా నటించిన ఈ మూవీతో కాజల్(Kajal) అతిథి పాత్రలో కనిపించింది. రంజాన్ సందర్భంగా సికిందర్(Sikandar) థియేటర్లలోకి వచ్చింది. కానీ ఎవరూ ఊహించని విధంగా రిలీజ్ కంటే ముందే సికిందర్ HD వెర్షన్ ఆన్లైన్ లోకి వచ్చేసిన విషయం తెలిసిందే.
ఇప్పుడు ఇప్పుడు బాలీవుడ్ కథనాల ప్రకారం సికిందర్ పైరసీ కంటెంట్‌కు, థియేటర్ కంటెంట్ కు చాలా భిన్నంగా ఉందని అంటున్నారు. ఆ తేడాల్లో కాజల్ ఆత్మహత్యకు ప్రయత్నించే సీన్, రష్మిక చనిపోయాక ఆమె గుండెను తీసుకునే అమ్మాయితో సల్మాన్ కారులో ఉండే దృశ్యం, ఇంటర్వెల్ కు ముందు సల్మాన్, సత్యరాజ్ మధ్య వచ్చే వార్నింగ్ సీన్ ఇంకొంచెం సాగదీసినట్టు ఉండటం, సల్మాన్ ఖాన్ ఓ రేంజ్ లో పెర్ఫార్మ్ చేసిన అజీబ్ దస్తాన్ సాంగ్ కూడా లేకపోవడం లాంటివి ఈ లీకులపై అనుమానాలను మరింత పెంచుతున్నాయి.
దీంతో సికిందర్ లీక్ ఎవరో కావాలనే చేశారని స్పష్టంగా తెలుస్తోంది. సినిమాకు పని చేసిన వారిలో నుంచి ఒకరు ఈ సినిమాను లీక్ చేశారని అర్థమవుతోంది. రెడ్ చిల్లీస్ వీఎఫ్ఎక్స్ కు సంబంధించిన వ్యక్తులెవరైనా ఈ లీక్ కు ఒడిగట్టారా అనే యాంగిల్ లో కూడా చిత్ర యూనిట్ ఆలోచిస్తుందట. ఎందుకంటే సెన్సార్ తర్వాత ఫైనల్ థియేట్రికల్ వెర్షన్ ను ఇంకా మెరుగుపరుద్దామని మళ్లీ ఎడిట్ చేయించారని, ఆ టైమ్ లోనే ఇది జరిగి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. మరి ఈ విషయంలో చిత్ర యూనిట్ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.













