రెండు కండిషన్స్ పై చిరంజీవికి తో నటించడానికి సై – సల్మాన్ ఖాన్
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ చిత్రంలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ దశలోనే ఉండగానే చిరు మరో సినిమాకు ఓకే చెప్పారు. ఈ సినిమా షూటింగ్ దశలోనే ఉండగానే చిరు మరో సినిమాకు ఓకే చెప్పారు. గతేడాది మలయాళంలో మోహన్‌లాల్, పృథ్వీ హీరోగా నటించిన ‘లూసీఫర్’ సినిమాను తెలుగులో రీమేక్ చేయబోతున్నట్టు ప్రకటించారు చిరంజీవి. మోహన్ లాల్ నటించిన ఈ పొలిటికల్ థ్రిల్లర్ అక్కడ మంచి విజయం సాధించి ఆయన కెరీర్‌లోని ఓ చెప్పుకోదగ్గ చిత్రంగా నిలిచింది. తెలుగులో ఈ సినిమా డబ్ కూడా చేసారు. ఆ సంగతి పక్కనపెడితే.. ఈ సినిమాను చిరంజీవితో రీమేక్ చేయాలనే ఉద్దేశంతో మంచి రేటుకు ఈ రీమేక్ హక్కులను రామ్ చరణ్ సొంతం చేసుకున్నాడు. ఇక అప్పటి నుంచి ఈ రీమేక్ దర్శకత్వ బాధ్యతలను ఎవరికి అప్పగించనున్నారనే విషయం టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. కాగా ఆ సినిమా తెలుగు రీమేక్ దర్శకత్వ బాధ్యతలు సుజిత్‌కు అప్పగించారు చిరంజీవి. ఇప్పటికే సుజిత్ ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్‌తో ప్రీ ప్రొడక్షన్ పనులను మొదలుపెట్టాడు. తాజాగా ఈ సినిమాలో బాలీవుడ్ అగ్ర హీరో సల్మాన్ ఖాన్ ముఖ్యపాత్రలో నటించబోతున్నట్టు ఓ వార్త ఫిల్మ్ నగర్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది. లూసీఫర్ చిత్రాన్ని డైరెక్ట్ చేసిన పృథ్వీరాజ్ ఈ చిత్రంలో కీ రోల్ పోషించాడు. ఇపుడు అదే పాత్రని తెలుగులో సల్మాన్ ఖాన్‌తో చేయించాలనుకున్నట్టు సమాచారం.
ముందుగా ఈ పాత్ర కోసం రామ్ చరణ్ పేరును చిరంజీవి పరిశీలించారు. ఆ తర్వాత అల్లు అర్జున్ పేరు కూడా పరిశీలనలోకి వచ్చింది. తాజాగా సల్మాన్ ఖాన్ పేరును చిరంజీవి సూచించాడట. కానీ సల్మాన్ ఖాన్ మాత్రం తెలుగులో తను ఈ పాత్రను చేస్తే.. రెండు కండిషన్స్ పెట్టాడట.
1. హిందీ రీమేక్ హక్కులను తనకు ఇవ్వడం 2.తెలుగు లో తాను చేసిన పాత్రలో రామ్ చరణ్ నటించడం.
మరి సల్మాన్ కండిషన్స్‌ను చిరంజీవి ఏ మేరకు ఒప్పకుంటాడా అనేది చూడాలి. అయినా ఒరిజినల్ గా ఇది మలయాళం సినిమా హిందీ రీమేక్ రైట్స్ ఇవ్వడానికి రామ్ చరణ్ హక్కులు ఎక్కడనుండి వస్తాయని అడిగాడు సల్మాన్ ఖాన్ ఇది మిలియన్ డాలర్ల ప్రశ్న?













