మరాఠీలో “మజిలీ”..అతిధిగా సల్మాన్ ఖాన్?
నాగ చైతన్య-సమంత జంటగా శివ నిర్వాణ తెరకకెక్కించిన `మజిలీ` ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. వైజాగ్ నేపథ్యంలో సాగే ప్రేమ కథ ఆద్యంతం ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. `మజిలీ` ప్రయాణంలో తమ మజిలీలు ప్రేక్షకులకి గుర్తు చేసిన సన్నివేశాలెన్నో ఉన్నాయి ఈ సినిమాలో. నాగచైతన్య కెరీర్ లో గొప్పప్రేమ కావ్యంగా మజిలీ నిలిచింది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా మంచి కలెక్షన్స్ ని సాధించింది.
తాజాగా ఈ సినిమాని మారాఠిలోనూ రీమేక్ చేస్తున్నారట. బాలీవుడ్ హీరో రితేష్ దేశ్ ముఖ్..జెనీలియా జంటగా ఈ మజిలీ మరాఠీ రీమేక్ లో నటిస్తున్నారు. ఈ చిత్రానకి దర్శకడు కూడా రితేష్ కావడం విశేషం. `వెడ్` అనే టైటిల్ తో దీన్నీ రీమేక్ చేస్తున్నారు. ఇందులో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ అతిధి పాత్ర పోషిస్తున్నట్లు తెలిపారు.
శుక్రవారం రితేష్ పుట్టిన రోజు సందర్భంగా తను రితేష్ తో ఆడిపాడిన అనుభవాన్ని సల్మాన్ ఖాన్ గుర్తు చేసుకున్నారు. ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది. ఈనెల 30న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ప్రేమకావ్యాలకు మరాఠీ ఇండస్ర్టీ పెద్ద పీట వేస్తుంది.
అప్పట్లో తెరకెక్కిన `జైరాట్’ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద 100 కోట్లు వసూళ్లు తెచ్చిన తొలి మరాఠీ చిత్రంగా రికార్డు సృష్టించింది. లవ్ స్టోరీ నేపథ్యంలో సాగిన సినిమా సగం షూటింగ్ హైదరాబాద్ లోనే చేసారు. మజిలీ కూడా స్టూడెంట్స్ జీవితంలో చోటు చేసుకున్న కొన్ని వాస్తవ సంఘటనల్ని ఆధారంగా చేసుకునే శివ నిర్వాణ తెరకెక్కించాడు.ఇందులో రితేష్ భార్య జెనీలియానే అతని ప్రేయసిగా నటించడం విశేషం. మరి ఈ రియల్ భార్య భర్తలు…రీల్ లైఫ్ ప్రేమికులుగా ఎలా నటిస్తారో వేచి చూడాల్సిందే.













