Salman khan: సల్మాన్ ఖాన్ కు ఏమైంది.. ఇంత తీవ్రమైన సమస్యలా..?

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఆరోగ్యంపై గత కొన్ని రోజులుగా ఎన్నో వార్తలు వస్తున్నాయి. అతనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ కూడా అయ్యాయి. అతని ఆరోగ్యం ఎలా ఉందనేది అభిమానులు క్లారిటీ కోరుకుంటున్నా.. దాని గురించి మాత్రం స్పష్టత రాలేదు. తాజాగా కపిల్ శర్మ షోలో పాల్గొన్న అతను ఆసక్తికర కామెంట్స్ చేసాడు. శనివారం జరిగిన ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో(Kapil show)లో సల్మాన్ ఖాన్ కొత్త సీజన్ కు తొలి అతిథిగా వచ్చాడు.
ఫిట్ గా లేడనే పుకార్లను తిప్పికొట్టి, సల్మాన్ అత్యంత ఫిట్ గా కనపడటంతో అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. అయినప్పటికీ, అతను ఇప్పటికీ తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నాడని బయటపెట్టాడు. తాను ట్రైజెమినల్ న్యూరల్జియా, బ్రెయిన్ అనూరిజం, ఆర్టెరియోవీనస్ మాల్ఫార్మేషన్ వంటి అనేక తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో పోరాడుతున్నట్లు వెల్లడించాడు. సల్మాన్ తొలిసారిగా 2017లో దుబాయ్‌లో తన ట్యూబ్‌లైట్ సినిమా ప్రమోషనల్ కార్యక్రమంలో తన ఆరోగ్యం గురించి బహిరంగంగా మాట్లాడాడు.
తాను ట్రైజెమినల్ న్యూరల్జియాతో బాధపడుతున్నానని వెల్లడించాడు. ఈ పరిస్థితిని ఆత్మహత్య వ్యాధి అని పిలుస్తారు. దాని వల్ల కలిగే తీవ్రమైన నొప్పి కారణంగా దానికి ఈ పేరు వచ్చింది. ఈ రుగ్మత ట్రైజెమినల్ నాడిని ప్రభావితం చేస్తుందట. దీనివల్ల ముఖం మొత్తం తీవ్రంగా నొప్పి ఉంటుంది. తనకు బ్రెయిన్ అనూరిజం, ఆర్టెరియోవీనస్ మాల్ఫార్మేషన్ (AVM) ఉందని కూడా ఆయన వెల్లడించాడు. బ్రెయిన్ అనూరిజం అంటే బలహీనమైన రక్తనాళంలో ఉబ్బరం, అది చీలిపోతే ప్రాణాంతకమైన హెమరేజిక్ స్ట్రోక్‌కు దారితీస్తుంది.