Salman Khan: పాప్ కార్న్ రేట్లపై మాట్లాడిన సల్మాన్ ఖాన్
గత కొంతకాలంగా సల్మాన్ ఖాన్(Salman Khan) నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద ఫ్లాపులుగా నిలుస్తూ ఆయనకు ఎంతో నిరాశను మిగులుస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు సల్మాన్ హీరోగా మురుగదాస్(Murugadoss) దర్శకత్వంలో వస్తోన్న సినిమా సికిందర్. రష్మిక మందన్నా(Rashmika Mandanna) హీరోయిన్ గా నటించిన ఈ సినిమా రంజాన్ సందర్భంగా మే 30న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్న సల్మాన్ ఖాన్ సికిందర్(Sikindar) ప్రమోషన్స్ లో చాలా యాక్టివ్ గా పాల్గొంటున్నారు. ప్రమోషన్స్ లో భాగంగా ఆయన టికెట్ ధరలు, పాప్కార్న్, కూల్ డ్రింక్స్ రేట్లను పరిమితం చేస్తూ, ఆ ఆదాయంలో ప్రొడ్యూసర్లకు షేర్ ఇవ్వాలని తన అభిప్రాయన్ని వెల్లిబుచ్చారు. అదే సందర్భంగా దేశంలో ఉన్న థియేటర్ల కొరత గురించి కూడా సల్మాన్ చెప్పుకొచ్చారు.
ఇండియాలో థియేటర్ల కొరత చాలా ఉందని, దేశం మొత్తానికి ఎంత లేదన్నా 20000కి పైగా థియేటర్లు అవసరమని ఆయన తెలిపారు. అంతేకాదు, ఈ మధ్య మాస్కి, క్లాస్ కి మధ్య తేడా తగ్గుతుందని, మల్టీప్లెక్సుల్లో కూడా సినిమాను చూసి ఆడియన్స్ కేరింతలు కొడుతున్నారని ఆయన అన్నారు. పీవీఆర్, ఐనాక్స్ లాంటి సంస్థల ఎగ్జిక్యూటివ్స్ కూడా మాస్ ను ఎక్స్పీరియెన్స్ చేయడానికి మాస్ థియేటర్లకు వెళ్లి సినిమాలు చూస్తున్నారని సల్మాన్ అన్నారు.













