ప్రియాంకను పక్కన పెట్టింది అందుకేనా?
సల్మాన్‌ఖాన్ హీరోగా రూపొందుతున్న భారత్ చిత్రం నుంచి ప్రియాంక వైదొలగడానికి రకరకాల కారణాలు వినిపిస్తుండడం తెలిసిందే. నిక్ జోనాస్‌ను త్వరలో పెళ్లి చేసుకోబోతున్న ప్రియాంక చోప్రా అందుకోసం భారత్ సినిమాను వదులుకుందనే వార్తలు అంత నమ్మశక్యంగా లేవని తెలుస్తోంది. తనతో నటించే హీరోయిన్లు తన సినిమా షూటింగ్ జరిగినన్నాళ్లూ తననే అంటిపెట్టుకొని ఉండాలని సల్మాన్ కోరుకుంటాడని, భారత్ సినిమా షూటింగ్ దగ్గరపడుతున్నా, విదేశీ బోయ్‌ఫ్రెండ్‌తో ప్రియాంక ఎఫైర్ నడుపుతుండడం సల్మాన్‌కి నచ్చలేదని, అందుకే తొలగించారని ఇన్సైడ్ వర్గాల సమాచారం.













