సల్మాన్ కు శిక్ష ఖరారు
కృష్ణ జింకల వేట కేసులో బాలీవుడ్ హీరో సల్మాన్‌ఖాన్‌కు రాజస్థాన్లని జోథ్‌పూర్ కోర్టు దోషిగా తేల్చింది. ఐదేళ్ల జైలు శిక్ష, రూ.10 వేల జరిమానా విధిస్తూ తీర్పుచెప్పింది. 1998 అక్టోబర్‌లో హమ్ సాథ్ సాథ్ హై చిత్రీకరణ సమయంలో సల్మాన్ కృష్ణజింకలను వేటాడారు. దీనిపై వన్యప్రాణి సంరక్షణ చట్టం 9, 51 సెక్షన్ల కింద అప్పట్లో పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ కేసులో సుమారు 20 ఏళ్ల తర్వాత న్యాయస్థానం తీర్పు వెలువరించింది. వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద గరిష్ఠంగా ఆరేళ్ల వరకు జైలుశిక్ష విధించే అవకాశం ఉండగా, ఐదేళ్ల జైలు శిక్షను న్యాయస్థానం విధించింది. ఈ కేసులో నిందుతులుగా ఉన్న నలుగురు నటులు సైఫ్ అలీఖాన్, టబూ, సోనాలి బింద్రే, నీలంలను మెజ్రిస్ట్రేట్ కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది.













