టైగర్3 కలెక్షన్స్ పై సల్మాన్ మాట
రీసెంట్ గా సల్మాన్ ఖాన్ నుంచి వచ్చిన భారీ సినిమా టైగర్ 3 అంచనాలను అందుకోలేకపోయింది. దీనికి కారణాలు వరల్డ్ కప్ ఫీవర్ అని, దీపావళి అని రీజన్స్ చెప్తున్నా సరే అసలు విషయంలో కంటెంట్ లో సరైన పస లేకపోవడమే అని అంటున్నారు క్రిటిక్స్. ఇప్పటివరకు టైగర్3 కనీసం రూ.500 కోట్ల మార్క్ కూడా అందుకోలేకపోయింది.
ఎవరెన్ని రీజన్స్ చెప్తున్నా సల్మాన్ ఖాన్ మాత్రం ఈ సినిమా మంచి కలెక్షన్స్ సాధించకపోవడానికి ఓ బీభత్సమైన రీజన్ చెప్పుకొచ్చాడు. సామాన్యుడికి టికెట్ రేట్లు అందుబాటు ధరలో అమ్మడం వల్లే టైగర్3 కు పెద్ద నెంబర్లు రాలేదని చెప్తున్నాడు సల్మాన్. కానీ సల్మాన్ చెప్పిన రీజన్ ఎక్కడా సింక్ అవట్లేదు. ఎందుకంటే టైగర్3 రిలీజ్ టైమ్ లో డిస్కౌంట్స్ కానీ, తక్కువ రేట్లు కానీ పెట్టింది లేదు.
అలాంటప్పుడు ఈ రీజన్ తో తక్కువ కలెక్షన్స్ వచ్చాయని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అనేది సల్మాన్‌కే తెలియాలి. రాబోయే సినిమాకు టికెట్ రేట్స్ ఎక్కువ పెట్టి, తాను పెద్ద మొత్తంలో కలెక్షన్స్ ను సాధిస్తానని చెప్పిన సల్మాన్ సోలోగా హిట్ కొట్టి చాలా కాలమైంది. అందుకే ఆ ఫ్రస్ట్రేషన్ లో అలా అంటున్నాడేమో అని యాంటీ ఫ్యాన్స్ కౌంటర్లు ఇస్తున్నారు. కాగా సల్మాన్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.













