Salman Khan: ఏజ్ గ్యాప్ పై రెస్పాండ్ అయిన సల్మాన్
సినిమా పరిశ్రమలో హీరోహీరోయిన్ల మధ్య ఏజ్ గ్యాప్ ఉందని నెట్టింట డిస్కషన్స్ జరుగుతూనే ఉంటాయి. ఈ డిస్కషన్స్ కొత్తేమీ కాదు. టాలీవుడ్ లో ఇదే విషయంలో చాలామంది హీరోలను విమర్శించారు. తెలుగులోనే కాదు, హిందీలో కూడా ఈ ట్రెండ్ ఉంది. తమ కంటే బాగా చిన్నవాళ్లైన హీరోయిన్లతో హీరోలు రొమాన్స్ చేయడాన్ని ఆడియన్స్ కామెంట్ చేస్తున్నారు.
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్(Salman Khan) కు సైతం ఇప్పుడు ఈ విమర్శ ఎదురైంది. సల్మాన్ ఖాన్ హీరోగా రష్మిక(Rashmika Mandanna) హీరోయిన్ గా తెరకెక్కిన సికిందర్(Sikindar) మూవీ మార్చి 30న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. ఈ ప్రమోషన్స్ లో భాగంగా రష్మికకు, తనకు మధ్య ఉన్న ఏజ్ గ్యాప్ పై వస్తున్న విమర్శలపై సల్మాన్ రెస్పాండ్ అయ్యారు.
రష్మికకు, తనకు మధ్య 31 ఏళ్ల వయసు తేడా ఉందని నాకు తెలుసు, రష్మికకు తెలుసని, ఈ విషయంలో రష్మికకు, తన తండ్రికి లేని సమస్య మిగిలిన అందరికీ ఎందుకొస్తుందో తనకు అర్థం కావడం లేదని సల్మాన్ అన్నారు. రష్మిక త్వరలోనే పెళ్లి చేసుకుని ఒక కూతురిని కంటే తను పెద్దయ్యాక ఆమెతో కూడా కలిసి వర్క్ చేస్తా, దానికి రష్మిక కూడా ఒప్పుకుంటుందనుకుంటున్నా అని సల్మాన్ అనగా, అందుకు రష్మిక నవ్వుతూ ఆయన చెప్పిన విషయాన్ని అంగీకరించింది. సల్మాన్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.













