సలార్ మెయిన్ స్టోరీ ఇదేనా?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న సినిమా సలార్. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను హోంబలే ఫిల్మ్స్ భారీ బడ్జెట్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఈ సినిమా సెప్టెంబర్ లో రిలీజ్ కావాల్సింది కానీ కొన్ని కారణాల వల్ల సినిమా డిసెంబర్ 22కు పోస్ట్ పోన్ అయింది.
ఈ సినిమా కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. పెద్దగా టైమ్ లేకపోవడంతో షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ త్వరగా పూర్తి చేయాలని భావిస్తున్నారు టీమ్. అక్టోబర్ 23న ప్రభాస్ బర్త్ డే సందర్భంగా సలార్ నుంచి టీజర్ వస్తుందనుకుంటున్న ఫ్యాన్స్ కు నిరాశ తప్పేలా లేదు. మేకర్స్ ప్రభాస్ బర్త్ డే ను ఒక్క పోస్టర్ తో సరిపెట్టేయనున్నారని తెలుస్తోంది.
అయితే ఇప్పుడు సలార్ స్టోరీకి సంబంధించి కొన్ని లీక్స్ వినిపిస్తున్నాయి. సలార్, దేవా తండ్రీ కొడుకుల క్యారెక్టర్స్ ప్రభాస్ చేస్తున్నాడు. రాజ మన్నార్‌గా జగపతిబాబు, అతని వారసుడు వరదరాజ మన్నార్‌గా పృథ్వీరాజ్ సుకుమార్ కనిపించనున్నారు. దేవా, వరదరాజు బెస్ట్ ఫ్రెండ్స్. సలార్ సామ్రాజ్యం నాశనం కావడానికి కారణమైన గ్యాంగ్‌కు లీడర్ తన ఫ్రెండే అని తెలిసి షాక్ ఐపోయి, అక్కడి నుంచి తన విశ్వరూపం చూపించనున్నాడని ఇదే కథలోని మెయిన్ ప్లాట్ అని తెలుస్తోంది. ఈ వార్తల్లో నిజమెంతన్నది తెలియాల్సి ఉంది.













