ప్రభాస్ మరోసారి 100 కోట్ల ఓపెనింగ్ తెస్తాడా?
సలార్ పై మార్కెట్ లో ఎంత క్రేజ్ ఉన్నా సరే చిత్ర నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ మాత్రం ఈ సినిమా ప్రమోషన్స్ విషయంలో అసలేమీ పట్టనట్టే ఉంది. మరో రెండు రోజుల్లో రిలీజ్ కాబోతున్న సలార్ మూవీ కోసం ఆడియన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. సలార్ ఫీవర్ దేశమంతటా వచ్చేసింది.
ఇప్పుడున్న క్రేజ్ ను బట్టి చూస్తుంటే సలార్ మొదటి రోజే వరల్డ్ వైడ్ గా వంద కోట్ల గ్రాస్ సాధించడం ఖాయమంటున్నారు విశ్లేషకులు. కంటెంట్ మీద నమ్మకంతోనే డైరెక్టర్ సలార్ విషయంలో చాలా తక్కువ మాట్లాడుతున్నాడని, మొదటి రెండు షో లు పూర్తయ్యాక ఆ టాక్తో ఎక్కడా టికెట్స్ అందుబాటులో ఉండని పరిస్థితి నెలకొంటుందంటున్నారు.
రీసెంట్ గా రిలీజ్ చేసిన కొత్త ట్రైలర్ ఆడియన్స్ కు విపరీతంగా నచ్చడంతో డంకీ రిలీజ్ అటెన్షన్ ను కూడా చాలా వరకు సలార్ డ్రాప్ చేసింది. ఒకవేళ సలార్ వంద కోట్ల మైల్ స్టోన్ ను రిలీజ్ రోజునే అందుకుంటే బాహుబలి2, ఆదిపురుష్, సాహో తర్వాత ప్రభాస్ మరోసారి ఆ ఘనత సాధించినట్లు అవుతుంది. అంతేకాదు ప్రభాస్ కు మాత్రమే ఇది సాధ్యమవుతుందని ఆ రికార్డ్ శాశ్వతంగా నిలిచిపోతుంది.













