సలార్2 వచ్చేదప్పుడే!
సలార్ తో పాటూ షారుఖ్ ఖాన్ డంకీ కూడా రిలీజైనప్పటకీ డంకీని పక్కకు నెట్టి మరీ క్రిస్మస్ విన్నర్ గా నిలిచింది సలార్ పార్ట్1 సీజ్ ఫైర్. డిసెంబర్ 22న రిలీజైన సలార్ ఇప్పటికీ బాక్సాఫీస్ దగ్గర స్టడీగానే ఉంది. చిత్ర బృందం చెప్తున్న దాన్ని బట్టి ఇప్పటికే సలార్ 600 కోట్ల గ్రాస్ దాటేసింది. మొత్తానికి సలార్2 కోసం మంచి బజ్ ను తెచ్చిపెట్టింది ఈ సినిమా.
సలార్ 2 శౌర్యంగ పర్వం గా రానుంది. సలార్ చూసిన వారిందరి దృష్టి ఇప్పుడు సీక్వెల్ పైనే ఉంది. ఈ సినిమా రావడానికి మరో రెండేళ్ళు పట్టనుందని రీసెంట్ గా నిర్మాత విజయ్ కిరగందూర్ క్లారిటీ ఇచ్చాడు. సలార్ 2కు సంబంధించిన షూటింగ్ ఈ ఏడాదే మొదలైనప్పటికీ, కొంత లేటయ్యే అవకాశమున్నట్లు ఆయన చెప్పుకొచ్చాడు.
తమకు సెంటిమెంట్ గా వస్తున్న నెలనే టార్గెట్ గా పెట్టుకుని వచ్చే ఏడాది డిసెంబర్ లో సలార్ 2ను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు ఆయన తెలిపాడు. ప్రస్తుతం సలార్ పార్ట్1 సక్సెస్ ను ఎంజాయ్ చేస్తూ రిలాక్స్ మోడ్ లో ఉన్న ప్రశాంత్ నీల్, మొదటిగా ఎన్టీఆర్ తో చేయనున్న సినిమాను స్టార్ట్ చేయాల్సి ఉంది. ఆ తర్వాత సలార్ 2 మీద నీల్ తన దృష్టిని పెట్టనున్నట్లు తెలుస్తోంది.













