సలార్2 టైటిల్ ఫిక్స్!
ఇప్పుడు ఎక్కడ చూసినా సలార్ మ్యానియానే నడుస్తోంది. రిలీజైన అన్ని చోట్లా ఈ సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తోంది. ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కిన ఈ సినిమా ఎండింగ్లో ప్రభాస్ ఫ్యాన్స్ కు మంచి సాలిడ్ అప్డేట్ ను ఇచ్చాడు ప్రశాంత్ నీల్. సలార్ మూవీకి సీక్వెల్ ఉంటుందని ఇప్పటికే చెప్పిన ప్రశాంత్ నీల్, క్లైమాక్స్ లో అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చాడు.
సలార్ మొదటి పార్ట్ కు సీజ్ ఫైర్ అని టైటిల్ పెట్టిన ప్రశాంత్, రెండో పార్ట్ కు శౌర్యాంగ్ పర్వంగా టైటిల్ను ఫిక్స్ చేశాడు. ఈ టైటిల్ ఫ్యాన్స్ లో ఉన్న అంచనాలను మరింత పెంచేసింది. పార్ట్ 2లో దేవ, వరద శత్రువులుగా ఎలా మారారో చూపించబోతున్నాడు నీల్. సలార్2 2024 డిసెంబర్ లో లేదా 2025 స్టార్టింగ్ లో రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది.
రూ.400 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన సలార్ పాన్ ఇండియా భాషల్లో రిలీజైంది. డంకీ విడుదలైన తర్వాతి రోజే ఈ సినిమా రిలీజైనప్పటికీ సలార్ మంచి ఓపెనింగ్స్ తో భారీ వసూళ్లను సాధించడం ఖాయమని ట్రేడ్ పండితులు చెప్తున్నారు. ఈ సినిమాతో ప్రభాస్ మరోసారి బాక్సాఫీస్ వద్ద తన స్టామినాను చూపించనున్నాడు.













