సలార్ వాయిదా పడనుందా?
ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటూ సినీ లవర్స్ కూడా ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న సలార్ సినిమా కోసం ఎంతగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భారీ అంచనాలతో ఈ సినిమా సెప్టెంబర్ 28న రిలీజ్ అవుతుందనుకుంటే ఇప్పుడు సలార్ పోస్ట్ పోన్ అయిందనే వార్త ఫ్యాన్స్ ను ఢీలా పడేలా చేస్తుంది. నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ ఈ విషయాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేయకపోయినప్పటికీ బెంగుళూరుకు చెందిన డిస్ట్రిబ్యూటర్ల నుంచి ఈ విషయం వినడంతో అందరూ ఇది దాదాపు నిజమేనని నమ్ముతున్నారు. సలార్ వాయిదా పడిందన్న వార్త రావడం ఆలస్యం, నిర్మాత నాగవంశీ ఆ డేట్ లో మ్యాడ్ అనే సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశాడు.
సలార్ కు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఇంకా చాలా వరకు పెండింగ్ ఉండటం, సీజీ వర్క్ విషయంలో ప్రశాంత్ నీల్ శాటిస్ఫై అవకపోవడంతోనే ఈ మూవీ వాయిదా పడుతుందని అంటున్నారు. దీంతో ఇప్పుడు సీజీ టీమ్ మళ్లీ ఆ వర్క్ ను స్టార్ట్ చేసినట్లు తెలుస్తోంది. మూడు వారాల డెడ్ లైన్ లో మొత్తం వర్క్ కంప్లీట్ చేయడం సాధ్యం కాదు కాబట్టే సినిమాను పోస్ట్‌పోన్ చేశారని టాక్. సలార్ ఇప్పుడు వాయిదా పడితే మళ్లీ డిసెంబర్ వరకు ఆగాల్సిందే. సంక్రాంతికి ఇప్పటికే చాలా సినిమాలున్నాయి కాబట్టి ఆ టైమ్ లో రిలీజ్ చేసి కలెక్షన్స్ ను తగ్గించుకోరు. మరి సలార్ రిలీజ్ డేట్ విషయంలో నిర్మాతలు ఏదొకటి త్వరగా తేల్చేస్తే బెటర్.













