సలార్ కోసం అద్భుతమైన ప్లాన్స్
సలార్ రిలీజ్ కు ఇంకా నెల రోజులకు పైగా టైమ్ ఉండటంతో ఆఖరి నిమిషంలో హడావిడి చేయకుండా ముందు నుంచే సినిమా ప్రమోషన్స్ ను రసవత్తరంగా జరపాలని నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలో యూఎస్ లో సలార్ బుకింగ్స్ ఈ నెల 25నుంచే ప్రారంభం కానున్నాయని తెలుస్తోంది. ఐమాక్స్ వెర్షన్ కూడా రెడీ అవుతుండటంతో దానికి తగ్గట్లు ముందే డిస్ట్రిబ్యూటర్లు స్క్రీన్స్ ను బ్లాక్ చేసుకుని జాగ్రత్త పడుతున్నారు. ఇండియాలో కూడా రెండు వారాల ముందే సలార్ టికెట్స్ ఆన్ లైన్ లో ఓపెన్ చేసేలా ప్లాన్స్ చేస్తున్నారట నిర్మాతలు. టికెట్ రేట్స్ హైక్స్, ఎక్స్ట్రా షో ల కోసం కూడా లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేయకుండా వారం ముందే అన్నీ రెడీ చేసుకోవడానికి ప్లాన్ చేసినట్లు సమాచారం.
సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లో అన్ని రాష్ట్ర ప్రభుత్వాల నుంచి పర్మిషన్లు తెచ్చుకుని టికెట్స్ ఓపెన్ చేస్తే అడ్వాన్స్ సేల్ లో రికార్డ్ సృష్టించొచ్చని ప్రణాళికలు వేస్తున్నారట. రిలీజ్ దగ్గర పడుతుండటంతో డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ ఫైనల్ కాపీ కోసం తెగ కష్ట పడుతున్నారు. సాంగ్స్ ఎక్కువగా లేకపోవడంతో రీరికార్డింగ్ పైనే దృష్టంతా పెట్టారని తెలుస్తోంది. మరో వారంలో ఈ సినిమా ప్రమోషన్స్ ప్లాన్ కూడా రెడీ కానుందని సమాచారం. మొత్తానికి సలార్ సినిమాకు నిర్మాతలు భారీ హైప్ క్రియేట్ చేసేట్లే ఉన్నారు.













