బుల్లితెరపై డిజాస్టర్ అయిన సలార్
స్టార్ హీరోల పాన్ ఇండియా సినిమాలకు శాటిలైట్ ప్రీమియర్లకు ఓ రేంజ్ లో రెస్పాన్స్ వస్తుంటుది. కానీ కొన్నిసార్లు మాత్రం ఊహించని రిజల్ట్స్ అందరినీ షాక్ కు గురయ్యేలా చేస్తాయి. రీసెంట్ గా టీవీలో ఫస్ట్ టైమ్ టెలికాస్ట్ అయిన సలార్ పార్ట్1కు కేవలం 6.5 టీఆర్పీ మాత్రమే రావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. సలార్ లాంటి సినిమాకు ఈ టీఆర్పీ అనేది చాలా అంటే చాలా తక్కువ.
మిక్డ్స్ టాక్ తో ఆడియన్స్ ను మెప్పించిన గుంటూరు కారం లాంటి సినిమాకు 9.2 టీఆర్పీ రాగా, ఆదికేశవ సినిమా 10కి పైగా టీఆర్పీలు నమోదు చేసుకుంది. కానీ సలార్ మాత్రం ఈ విషయంలో చాలా దారుణంగా ఫ్లాప్ అయింది. దీనికి కొన్ని కారణాలున్నాయి. సలార్ సినిమా ఫ్యామిలీ అంతా కూర్చుని సరదాగా చూసే సినిమా కాదు. పైగా ఈ మూవీ రిలీజై నాలుగు నెలలవుతుంది.
ఇప్పటికే అందరూ ఓటీటీలో చూసేసి ఉన్నారు కాబట్టి మళ్లీ టీవీలో యాడ్స్ తో చూసేంత ఓపిక జనాలకు లేదు. పైగా ఐపీఎల్ హవా ఓ రేంజ్ లో నడుస్తుంది. లైవ్ మ్యాచ్లు చూడటానికి అందరూ ఏ స్థాయిలో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో జియో యాప్ లో కౌంట్ చూస్తే అర్థం అవుతుంది. ఇలాంటి టైమ్ లో సలార్ కు వచ్చిన ఈ రెస్పాన్స్ అందరికీ నిరాశ కలిగించినప్పటికీ బుల్లితెరపై మాత్రం సలార్ డిజాస్టర్ గా మిగిలిపోయింది.













