ఆ విషయంలో సలార్‌కు నో టెన్షన్
ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న సలార్ సినిమా ఈ నెల 22న రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. రెండు భాగాలుగా రానున్న ఈ సినిమా మొదటి పార్ట్ ఇప్పటికే సెన్సార్ పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది. ఫైనల్ రన్ టైమ్ విషయంలో డైరెక్టర్ కాంప్రమైజ్ కాకుండా 2 గంటల 55 నిమిషాల 22 సెకన్లకు లాక్ చేశాడని సమాచారం.
కంటెంట్ లో దమ్ముంటే రన్ టైమ్ మ్యాటర్ కాదనేది ఈ మధ్యే వచ్చిన యానిమల్ సినిమా నిరూపించింది. దీంతో నిర్మాతలు సైతం 3 గంటల రన్ టైమ్ కు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. రిలీజ్ కు మరో పదకొండు రోజులే ఉండటంతో సలార్ టీమ్ ప్రమోషన్స్ ను వేగవంతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ప్రభాస్ ప్రమోషన్స్ లో పాల్గొంటాడా లేదా అన్నది మరో రెండు రోజుల్లో తెలియనుంది. త్వరలో రిలీజ్ చేయనున్న రెండో ట్రైలర్ తో సినిమాపై ఉన్న హైప్ ను అమాంతం పెంచనున్నారట మేకర్స్. 3.40 నిమిషాల నిడివితో ప్రభాస్‌ను, యాక్షన్ ఎపిసోడ్స్‌ను హైలైట్ చేస్తూ సలార్ రెండో ట్రైలర్ ను కట్ చేయించారట. మొత్తానికి ఎప్పుడూ చూడని భారీ యాక్షన్ డ్రామాకు రంగం సిద్దం చేశారు సలార్ మేకర్స్. మరి ప్రభాస్ సలార్ తో ఎన్ని రికార్డులు సృష్టిస్తాడో చూడాలి.













