తేడా వస్తే కష్టమే సలార్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తోన్న యాక్షన్ థ్రిల్లర్ సలార్. ఈ సినిమా డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాపై నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ చాలానే పెట్టుబడి పెట్టింది. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ పై ఉన్న నమ్మకంతో అవసరమైతే సినిమా బిజినెస్ జరగని ఏరియాల్లో సొంతంగా రిలీజ్ చేయాలని డిసైడైంది.
శాండిల్ వుడ్లో సినిమాను నిర్మాతలే ఓన్ రిలీజ్ చేసుకుంటున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు అయిన థియేట్రికల్ రైట్స్ బిజినెస్ చూస్తే ఆ రేటు కాస్త రిస్క్ అనేలానే ఉంది. సలార్ ద్వారా నిర్మాతలు మాత్రం థియేట్రికల్ రైట్స్ ద్వారా మంచి లాభాలందుకున్నారు కానీ పెట్టుబడులు పెట్టిన బయ్యర్లు మాత్రం ఈ సినిమా విషయంలో రిస్క్ తీసుకుంటున్నారనే మాటలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.
ఓన్లీ ఆంధ్ర రీజనల్లోనే ఈ సినిమా సుమారు 80 నుంచి 85 కోట్ల బిజినెస్ చేసింది. అంటే మినిమం 150 కోట్ల గ్రాస్ వసూలు చేస్తే కానీ ఆంధ్ర లో సలార్ లాభాల జోన్ లోకి రాదు. నైజాంలో 70 కోట్ల బిజినెస్ జరిగింది. అంటే 130 కోట్ల వరకు గ్రాస్ రావాలి. ఏదేమైనా సలార్ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంటేనే లాభాలొచ్చి బయ్యర్లు సేఫ్ జోన్ లోకి వస్తారు. లేదంటే మాత్రం భారీ మూల్యాన్ని సలార్ రూపంలో డిస్ట్రిబ్యూటర్లు నష్టపోవాల్సి వస్తుంది.













