సలార్.. ఏరియా ఏరియాకు హై డిమాండ్
అన్నీ అనుకున్నట్లు జరిగి ఉంటే సలార్ సినిమా ఈ పాటికి రిలీజై బాక్సాఫీస్ ను షేక్ చేస ఉండాల్సింది కానీ కొన్ని కారణాల వల్ల ఈ సినిమా డిసెంబర్‌కు పోస్ట్ పోన్ అయింది. బాహుబలి తర్వాత సరైన హిట్ లేక మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్ కు ఇది తీవ్ర నిరాశగా మిగిలింది. దానికి తోడు సినిమా పోస్ట్ పోన్ అవడంతో బిజినెస్ విషయంలో కూడా కొన్ని తేడాలొచ్చినట్లు గత కొన్నాళ్లుగా వార్తలొస్తున్నాయి.
అడ్వాన్స్ ఇచ్చిన వాళ్లు కూడా డీల్స్ క్యాన్సిల్ చేసుకోవాలనే ఆలోచనతో ఉన్నారని నెట్టింట తెగ ప్రచారం జరుగుతుంది. కానీ నిర్మాణ సంస్థ మాత్రం ఇవేమీ పట్టనట్లు రియాక్ట్ కాకుండా ఉంది. ఇదిలా ఉంటే సలార్ కు సంబంధించిన కొన్ని ఏరియాల బిజినెస్‌లు ఇప్పటికీ క్లోజ్ కాలేదన్నది తాజా సమాచారం.
రీసెంట్గా తూర్పు గోదావరి జిల్లా రైట్స్ కు ఓ ప్రముఖ కంపెనీ రూ.12 కోట్లు ఆఫర్ చేయగా, నిర్మాతలు రూ.15 కోట్లు చెప్పారని, కానీ చివరకు 13.60 కోట్ల వరకు తగ్గారని తెలుస్తోంది. కానీ ఆ సంస్థ మాత్రం రూ.12 కోట్లకు ఇస్తే రైట్స్ తీసుకుందామని వెయిట్ చేస్తుందట. మరో రెండు రోజుల్లో ఈ విషయంలో క్లారిటీ రానుంది. హోంబలే ఫిల్మ్స్ భారీ బడ్జెట్ తో నిర్మించిన సలార్ పెట్టుబడి మొత్తం కూడా ముందుగానే వెనక్కు తెచ్చుకునే ప్రయత్నంలో భాగంగానే ఇలా భారీ రేట్లు చెప్తున్నట్లు తెలుస్తోంది. ఇంత భారీ బిజినెస్ చేస్తున్న సలార్ సినిమా డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రానుంది.













