క్రిస్మస్కి సలార్ వస్తే.. మిగిలినవెప్పుడు?
సలార్ సినిమా పోస్ట్ పోన్ కావడంతో కొన్ని నెలల పాటూ అన్ని రకాల భాషల్లో డేట్స్ అటు ఇటు అయ్యాయి. చాలా సినిమాల రిలీజ్ డేట్స్ మారాయి. సెప్టెంబర్ 28న సలార్ రిలీజ్ కావాల్సింది. కానీ పోస్ట్ పోన్ అయింది. ఇప్పుడు కొత్త రిలీజ్ డేట్ గా డిసెంబర్ 22 అనుకుంటున్నారు. దీంతో క్రిస్మస్ రిలీజ్ కు రెడీ అయిన సినిమాల పరిస్థితేంటా అని అందరూ కంగారు పడుతున్నారు.
సలార్ క్రిస్మస్ రేస్ లో రిలీజ్ అవుతుందని తెలియగానే ముందు హిందీ చిత్ర పరిశ్రమ ఉలిక్కిపడింది. క్రిస్మస్ కు షారుఖ్ ఖాన్ డుంకి సినిమా ఇప్పటికే షెడ్యూల్ అయి ఉంది. ఇది క్లాస్ సినిమా. సలార్ మాస్ సినిమా. ఒకవేళ సలార్ క్రిస్మస్ కు రిలీజైతే డుంకికి చాలా ఇబ్బందే ఎదురవుతుంది. సలార్ లాంటి మాస్ సినిమాతో డుంకి పోటీపడి నిలవలేదు.
ఇక టాలీవుడ్ లో విక్టరీ వెంకటేష్ హీరోగా వస్తున్న సైంధవ్ సినిమా క్రిస్మస్కే రిలీజ్ కానుంది. దాంతో పాటూ నేచురల్ స్టార్ నాని హీరోగా వస్తున్న హాయ్ నాన్న, నితిన్ ఎక్స్ట్రా కూడా క్రిస్మస్ కే షెడ్యూల్ అయ్యాయి. దానికి తగ్గట్లే ఆయా చిత్ర వర్గాలు షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ను ప్లాన్ చేసుకుంటున్నాయి.
ఇప్పుడు సలార్ క్రిస్మస్ కు వస్తుందంటే కచ్ఛితంగా ఈ సినిమాలన్నీ పోస్ట్ పోన్ అవుతాయి. తర్వాత సంక్రాంతి కి ఎలాగూ పెద్ద సినిమాలే రిలీజ్ కు ఉన్నాయి. ఇక మళ్లీ ఆ సినిమాలకు మంచి డేట్స్ అంటే సమ్మర్ హాలిడేస్. అప్పటివరకు మంచి రిలీజ్ డేట్స్ లేనే లేవు. సలార్ సినిమా రిలీజ్ డేట్ పై క్రిస్మస్ మూవీల రిలీజ్ డేట్స్ ఆధారపడి ఉన్నాయి.













